క్రొత్త యేడు మొదలు పెట్టెను - krotha yedu modhalu pettenu song lyrics

క్రొత్త యేడు మొదలు పెట్టెను - మన బ్రతుకునందు 
క్రొత్త యేడు మొదలు పెట్టెను (2)
క్రొత్త మనసు తోడ మీరు  క్రొత్త యేట ప్రభుని సేవ 
దత్తర బడకుండ జేయు టుత్తమోత్తమంబు జూడ  
                                                            " క్రొత్త " 
చరణం 1: 
పొందియున్న మేలులన్నియు  బింకబు మీర 
డెందమందు స్మరణ చేయుడి  - యిందు మీరు మొదలు బెట్టు పందెమందు గెల్వవలయు నందు ముగను రవిని బోలి నలయ కుండ మెలయ కుండ          " క్రొత్త " 

చరణం 2: 
మేలు సేయన్ దడ నొనర్పన్ గా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు  గడచెగా - పాలు మాలి 
యుండకుండ  జాల మేలు సేయ వలయున్ జాల  జనముల కిమ్మాను యేలు నామ ఘనత కొరకున్" క్రొత్త "

చరణం 3: 
బలము లేని వారమయ్యును బలమైందవచ్చున్ గలిమి మీర గర్త వాక్కున - నలయ కుండ  నలగకుండ  మోద మొంది బలమోసంగు సర్వ విధుల నెలమి  మీ నొనర్చు చుండన్                                              " క్రొత్త " 

చరణం 4: 
ఇద్దరిత్రి నుండు నప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి బొందన్
జూడ వలయును - బుద్ధినీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ
జేయ శుద్ధులైన వారిలోన్ ప్రసిద్ధు లగుచు  వెలున్గ వచ్చు 
                                                        " క్రొత్త " 

చరణం 5: 
పాప పంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు జూరి
మీరు వేఁడగా నేపు మీరన్ దనదు కరుణన్ బాప మంతన్
గడిగి వేసి పాప రోగ చిహ్న లన్ని బాపి వేసి శుద్ధిన్ చేయున్
                                                        " క్రొత్త "  




 

Comments

Popular Posts