ఇన్నేళ్లు ఇలలో - innellu ilalo song lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో 
గతించి పోయే కాలం - స్మరించు యేసు నామం 
సంతోషించు ఈ దినం               " ఇన్నేళ్లు "

లోకమే నటనాలయం 
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం 
పరలోక దేవుని నిత్య జీవం 
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే 
పదిల పరచెనే రక్షణ భాగ్యం      " ఇన్నేళ్లు "    

మారు మనస్సు మనిషికి మార్గం 
పశ్చాత్తాపం మనిసుకి మోక్షం (2)
నీ పూర్ణ హృదయం తో మొకరిల్లుమా 
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా 
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే 
కరుణించునే కలకాలం             " ఇన్నేళ్లు " 

Comments

Popular Posts