గడచిన కాలం - gadachina kaalam song lyrics
గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాప వలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము కాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము " గడచిన "
కలత చెందిన కష్ట కాలమునా
కన్నతండ్రివై నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చినా
కాదనకా నన్ను కరునించినా (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము " గడచిన "
లోపములెన్నో దాగియున్ననూ
దరి చేరి నన్ను నడిపించినా (2)
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయ చేసినా (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము (2) " గడచిన "
.
Comments