అంతా నా మేలుకే - anthaa naa meluke song lyrics

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ 
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండిన్ (2)
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే 
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే 
తన చిత్తమునకు తల వంచితే 
ఆరాధన ఆపను - స్థితియించుట మానను (2)
స్తుతియించుట మానను  


చరణం 1: 
కన్నీళ్లే పానములైనా -  కఠిన దుఃఖ బాధలైనా 
స్థితిగతులే మారినా - అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
                                             " అంతా నా " 
చరణం 2: 
ఆస్థులన్నీ కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా  
ఊపిరి బరువైనా - గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగును గాక (2) 
                                             " అంతా నా "                      
చరణం 3: 
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా 
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) 
నీవు నాకుండగా - ఏదియు నాకక్కరలేదు (2)
నీవు నాకుండగా - ఏదియు నాకక్కరలేదు (2)
                                            " అంతా నా " 
చరణం 4: 
ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైనా 
అధికారం కప్పుకొని - రక్షణ కొరకై ఆనందింతును (2)
నాదు మనసు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతినే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) 
                                          " అంతా నా " 
చరణం 5: 
చదువులే రాకున్నా - ఓటమి పాలైనా 
ఉద్యోగం లేకున్నా - భూమికే బరువైనా (2) 
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియమములు (2)
నీవుద్దేశించినది - నిష్ఫలము కానేరదు (2)
                                          " అంతా నా " 
చరణం 6: 
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు 
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2)
                                         " అంతా నా " 
చరణం 7: 
నీవు చేయనది నాకిప్పుడు తెలియదు 
ఇకమీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2)
                                        " అంతా నా " 





.




Comments

Popular Posts