ఆనంద గీతము - anandha geethamu song lyrics
ఆనంద గీతము నే పాడేద క్రిస్టమస్ శుభవేళలో -
సంతోషముగా నే కీర్తించెద
క్రీస్తేసుని సన్నిధిలో (2)
దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను (2) " ఆనంద గీతము "
1) ప్రభువొచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను
మన పాప భారం తొలగింపను
ఈ భువికే దిగి వచ్చెను (2)
దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను రక్షకుడే
జన్మించెను (2) " ఆనంద గీతము "
2) దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి - బంగారు సాంబ్రాణి
బోలమును ప్రభు యేసునకర్పించిరి (2)
దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను
రక్షకుడు జన్మించెను (2) " ఆనంద గీతము "
3) జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన
ప్రభు పుట్టెను ప్రవచనమే నెరవేరెను (2)
దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో - పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను (2) " ఆనంద గీతము "
Comments