ఇంటి మీదనున్న - inti meedhanunna song lyrics

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను 
కన్నీటితో కృంగి పోతున్నాను (2) 
నా యేసయ్యా నా బలమా (2) 
నా దీన ప్రార్ధన ఆలకించుమా                 " ఇంటి " 

వేట గాని బాణములు చేయుచుండె గాయములు 
అపవాది కోరలు కోరు చుండె ప్రాణమును (2)
నీ బలి పీఠము చెంత నాకు చోటు నీయుమా (2)
ఆలకించుమా  ఆదరించుమా  (2)        " ఇంటి "


తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు 
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు (2)
నీ ఆత్మను కోల్పోయినా దీనుడను నేను (2)
ఆలకించుమా ఆదరించుమా (2)          " ఇంటి " 

Comments

Popular Posts