ఇంతలోనే కనబడి - inthalone kanabadi song lyrics

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే 
అల్పమైన దానికా ఆరాటం 
త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి 
స్వల్పమైన దానికా పోరాటం  
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం 
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు       " ఇంతలోనె " 

బంగారు కాసులున్న - అపరంజి మేడలున్నా
అంతరించి పోయెను - భువిని ఏలిన రాజులు (2)
నాది నాది నాదియంటు విర్ర వీగుచున్నావా 
చచ్చినాక నీది అన్న  దేహమైనా వచ్చునా  " ఇంతలోనే " 

మోయలేక బ్రతుకు భారం మూర్ఛ బోయిరెందరో 
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకం లో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయములో 
చేర్చునిన్ను మోక్ష మార్గం నడుపు నిన్ను శాంతితో 

Comments

Popular Posts