ఇంతగ నన్ను - inthaga nannu song lyrics

ఇంతగ నన్ను - ప్రేమించినది 
నీ రూపము నాలో రూపించుటకా 
ఇదియే నా యెడ నీకున్న నిత్య సంకల్పమా (2) 

శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా
శిలనైనా నను -  నీ వలె మార్చుటకా 
శిల్పకారుడా నా యేసయ్య 
మలుచుచుంటివా నీ పోలికగా (2)        " ఇదియే " 


తీగలు సడలి - అపస్వరములమయమై 
మూగ బోయెనే - నా స్వర మండలము 
అమరజీవ స్వర కల్పనలు 
నా అణువణువునా పలికించితివా        "ఇదియే " 




Comments

Popular Posts