ఇదిగో దేవా నా జీవితం - idhigo deva na jeevitham song lyrics
ఇదిగో దేవా నా జీవితం
ఆ పాద మస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)
పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నను దరి చేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం " ఇదిగో "
నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్ధించి పనిచేయనిమ్ము (2)
ఆగి పోక సాగిపోవు
ప్రియ సుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము " ఇదిగో "
విస్తార పంట పొలము నుండి
కష్టించి పనిచేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలికాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిను ఘనపరచు బ్రతుకునిమ్మయా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయా " ఇదిగో "
Comments