ఏలో ఏలో అంటూ - elo elo antu vacharandi gollalu song lyrics

రచన  : joshua shaik 
గానం  : javed ali 
Youtube : https://youtu.be/vPpBTNnIIGs


ఓ .. ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండి గొల్లలు 
సంతోషాలే పొంగేనండీ హైలెస్సా ... (2) 
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే 
సంగీతాలే పాడాలండీ హైలెస్సా ... 
అంధకారాన్నె తొలగించె మహనీయుడు 
పుట్టినాడండీ యేసయ్య మన దేవుడు 
నిన్నే కోరి.. నిన్నే చేరి..  
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 

చరణం 1: 
ఓ... లోకాలనేలేటి రారాజు రా 
ఉదయించే సూర్యుడై వచ్చాడు రా 
ఆకాశ వీధి ... మెరిసేటి దారి ... 
ఒక తార మురిసింది గా ...
దూతాళి పాడి .. కొలిచారు చూడు.. 
ఘనమైన ఒక వేడుక .. 
ఆ గొల్లలేగా దరువేసే చూడు 
మెస్సయ్య పుట్టాడని ... 
మన మెస్సయ్య పుట్టాడని ... 

చరణం 2: 
వెన్నెల్లో పూసింది ఓ సందడీ 
పలికింది ఊరంతా ఈ సంగతి 
ఈ దీనుడంట పసిబాలుడంట 
వెలిసాడు మహారాజుగా (2)
మనసున్న వాడు దయచూపు వాడు 
అలనాటి అనుబంధమే 
కనులారా చూడు మనసార వేడు 
దిగి వచ్చే మనకోసమే 
ఇల దిగివచ్చె మనకోసమే 

చరణం 3: 
ఆ నింగి తారల్లా వెళగాలిరా 
జగమంతా చూసేలా బ్రతకాలి రా 
వెలిగించువాడు మనలోని వాడు 
నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి పిలిచింది చూడు 
మనలోని ఒక పండుగ 
భయమేల నీకు దిగులేల నీకు 
యేసయ్య మనకుండగా 
మన యేసయ్య మనకుండగా 

Comments

Popular Posts