ఈలాటిదా యేసు ప్రేమ - eelatidha yesu prema song lyrics
ఈలాటిదా యేసు ప్రేమ
నను తులనాడక తనదు జాలి చూపినదా (2)
ఎనలేని పాప కూపమున నేను
తనికి మిణుగుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు
వేగకొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె " ఈలాటిదా "
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను
మునిగి కుములుచు నేడు పనుగొండు నపుడు
నను నీచుడని త్రోయలేక - తనదు
నెనరు నా కగుపరచి నీతి చూపించె " ఈలాటిదా "
నెమ్మి రవ్వంతైనా లేక - చింత
కమ్మి పొగలుచు నుండగా నన్ను చూచి
సమ్మతిని నను బ్రోవ దలచి - కరము
చూచి నా చేయిబట్టి చక్కగా పిలిచె " ఇలాటిదా "
పనికిమాలిన వాడనైన నేను
కనపరచు నా దోష కపట వర్తనము
మనసు నుంచక తాప పడక ఇంత
ఘనమైన రక్షణ మును నాకు చూపె " ఈలాటిదా "
నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది లోక
వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ - శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు " ఈలాటిదా "
శోధనలు నను చుట్టినప్పుడు - నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి - ఇట్టి
యాదరణ చూపిన యహాహా ఏమందు " ఈలాటిదా "
Comments