ఆయనే నా సంగీతము - ayane na sangeethamu song lyrics
ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
జీవాధి పతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదను (2) " ఆయనే "
స్తుతులమధ్య లో నివాసం చేసే
దూతలెల్ల పొగడే దేవుడాయెనే (2)
వేడుచుండు భక్తుల మొరలు విని (2)
దిక్కు లేని పిల్లలకు దేవుడాయెనే (2) " ఆయనే "
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండేదననిన నా దేవుని (2)
కరములు తట్టి నిత్యము స్తుతించెదను (2)
సృష్టి కర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల స్తుతించెదను (2)
ప్రభు రాకడలో నిత్యముండును (2)
మ్రొక్కెదము స్తుతించెదమ్ పొగడెదము (2) " ఆయనే "
Comments