అవధులే లేనిది - avadhule lenidhi song lyrics

అవధులే లేనిది దివ్యమైన నీ కృప 
అనంతమైనది ఆశ్చర్యమైనది 
యేసయ్యా నా పై నీవు చూపిన కృప 
అమూల్యమైనాది వర్ణించలేనిది (2)   " అవధులే " 

ఊహించలేని హృదయానందమును 
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారం ఎక్కువైనా తీరం కడు దూరమైనా 
నీ పై ఆనుకొందును 
నేను గమ్యం చేరుకొందును (2)         " అవధులే " 

సరిపోల్చలేని మధురమైన అనుభవం 
వింతైన నీ ప్రేమ లో అనుభవింపచేసావు (2)
సౌందర్యమైన అతి పరిశుద్ధమైన 
నీ రూపము తలచుకొందును 
నేను నీ కోసమే వేచియుందును (2)  " అవధులే " 

లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలమునిచ్చి నావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి నేను 
లక్ష్యము వైపు సాగెద (2)               " అవధులే " 

Comments

Popular Posts