ఆశపడకు ఈ లోకం కోసం - ashapadaku ee lokam kosam song lyrics
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా
ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా
మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా (2)
ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా
దేహం కోరేదేదైనా అది మట్టి నుండి పుట్టిందమ్మా (2)
వెండి బంగారు వెలగల వస్త్రం
పరిమళ పుష్ప సుగంధములు (2)
మట్టిలోనుండి పుట్టినవేనని
మారువబోకుమా చెల్లెమ్మా (2) " ఆశ పడకు "
అందమైన ఓ సుందర స్త్రీ కి
గుణము లేక ఫలమేమమ్మా
పంది ముక్కున బంగరు కమ్మి
పెట్టిన ఫలితం లేదమ్మా (2)
అందమైన ఆ దీన షెకెములో
హద్దు లేక ఏమయ్యిందమ్మా (2)
అంత రంగమున గుణము కల్గిన
శారా చరిత్ర కెక్కిందమ్మా (2) " ఆశ పడకు "
జాతి కొరకు ఉపవాస దీక్షతో
పోరాడిన ఎస్తేరు రాణి లా
నీతి కొరకు తన అత్తను విడువక
హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2)
కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి
తన కురులతో తుడిచిన మగ్ధలేనే లా (2)
హన్నా వలె మన దోర్కా వలె
ప్రిస్కిల్ల వలె విశ్వాస వనితలా (2)
వారి దీక్షయే వార సత్వమై
అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై
పవిత్రమైన హృదయము కలిగి
ప్రభువు కొరకే జీవించాలమ్మా (2) " ఆశపడకు "
Comments