అనురాగాలు కురిపించె - anuragalu kuripinche song lyrics
అనురాగాలు కురిపించె నీ ప్రేమ తలచి
అరుదైన రాగలనే స్వర పరచి
ఆనంద గానాలే సప్త స్వరాలుగా నే పాడనా
యేసయ్య నా హృదయ సీమను ఏలుమయా
నీ దివ్య సన్నిధి చాలనయ
1) నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వసత్యములలో నే నడుచుటకు
మరపు రాని మనుజాశలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే " అను "
2) అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్య కరమైన నీ కృప పొంది - కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే " అను "
3) నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు
అమూల్యమైన విశ్వాసము పొంది - అనుక్షణం నిన్ను
తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే " అను "
Comments