అన్ని వెళల వినువాడు - anni velala vinuvadu song lyrics

అన్నివేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
యే బేధము లేకనే ఆలకింపనై యున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే 
కనిపెట్టుము విశ్వాసము తో (2)
నీ ప్రార్ధన మార్చును నీ స్థితినీ
నీ ఎదలొ కన్నీరు తుడుచును 

కుమిలిపోతూ నలిగిపోతు 
ఏమవుతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతు నిరాశలో మునిగావా 
ఒక సారి యోచించవా !
నీ మొరను వినువాడు యేసయ్యే  (2)     " అన్ని వెళల "

ఎవరికి చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొర పెట్టిన వారికి సమీపముగా
యేసు ఉండును (2)
ఒకసారి యోచించవా 
నీ మొరను వినువాడు యేసయ్యే (2)      " అన్ని వెళల " 


Comments

Popular Posts