అంకితం ప్రభు - ankitham prabhu
అంకితం ప్రభు నా జీవితం
నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణ
అంగీకరించుము నాదు రక్షకా (2)
మోడుబారిన నా జీవితమును
చిగురింప జేశావు దేవా
నిస్ఫలమైన నా జీవితం
ఫలియింప జేశావు ప్రభువా (2)
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ " అంకితం "
కారు చీకటి కాఠిన్య కడలిలో
నీ కాంతి నిచ్చావు దేవా
చీకటిలో నున్న నా జీవితం
చిరుదివ్వెగా చేసావు ప్రభువా (2)
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీక రించుము నా సమర్పణ " అంకితం "
Comments