అందరు నన్ను విడచిన - andharu nannu vidachina

అందరూ నన్ను విడిచిన 
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవె నా తండ్రియు నీవె
నా తల్లి తండ్రి నీవె యేసయ్యా (2)

1) వ్యాధులు నన్ను ముట్టినా  
    బాధలు నన్ను చుట్టినా (2)
    నా కొండయు నీవె - నా కోటయు నీవె 
    నా కొండ కోట నీవే యేసయ్య (2) 

2) లోకము నన్ను విడచినా 
     నీవు నన్ను విడువనంటివే (2)
     నా బంధువు నీవె నా మిత్రుడ నీవె 
     నా బంధుమిత్రువు నీవె యేసయ్య (2)

3) నేను నిన్ను నమ్ముకొంటిని
     నీవు భయపడకంటివే (2)
     నా తొడుయు నీవె నా నీడయు నీవె 
     నా తోడు నీడ నీవె యేసయ్య (2) 
    

Comments

Popular Posts