అల్ఫా ఒమేగయైన - alfa omega yaina song lyrics

అల్ఫా ఒమేగాయైన మహిమాన్వితుడా 
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా 
రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా 
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా 
నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే 
నా యేసయ్యా ...      

1) కనికరపూర్ణుడా నీ కృపా బాహుళ్యమే 
ఉన్నతముగా నిను ఆరాధించుటకు 
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి 
నూతన వసంతములో చేర్చెను (2)
జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే        " అల్ఫా " 

2) తేజోమయుడా నీ దివ్య సంకల్పమే 
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు 
ఆశ నిరాశల వలయాలు తప్పించి 
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాధన నీకే   "అల్ఫా "

3) నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే 
శుభ సూచనగా నను నిలుపుటకు 
అంతులేని అగాధాలు దాటించి 
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే     " అల్ఫా " 



Comments

Popular Posts