ఆలయం లో ప్రవేశించండి - alayam lo pravesinchandi song lyrics

ఆలయంలో ప్రవేశించండి అందరూ 
స్వాగతం సుస్వాగతం యేసు నామం లో 
నీ బ్రతుకులో పాపమా కలతలా 
మీ హృదయం లో బాధలా కన్నీరా 
మీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం
                                                            " ఆలయం"

దీక్ష స్వభావం తో ధ్యాన స్వభావమై 
వెతికే వారికంత కనబడు దీపము 
యేసు రాజు మాటలే వినుట ధన్యము 
వినుట వలన విశ్వాసం అధికమదికమై
ఆత్మలో దాహము తీరును రారండి 
అనామానందం హల్లెలూయ                   " ఆలయం " 

ప్రభుయేసు మాటలే పెదవిలో మాటలై 
జీవ వృక్షంబుగా ఫలియించాలని 
పెదవితో పలికెదం మంచి మాటలే 
హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం 
ఆనందమానందం హల్లెలూయా             " ఆలయం " 

Comments

Daniel phinehas said…
నాకూ బాగ ఇష్టం అయిన పాట ఎప్పుడూ first place లో ఉంటుంది

Popular Posts