అదే అదే ఆ రోజు - adhe adhe aaroju song lyrics

అదే అదే ఆ రోజు - యేసయ్య ఉగ్రత రోజు 
ఏడేండ్ల శ్రమల రోజు - పాపులంత ఏడ్చే రోజు  " అదే " 

1) వడగండ్లు కురిసే రోజు - భూమి సగం కాలే రోజు 
నక్షత్రములు రాలే రోజు - నీరు చేదు అయ్యే రోజు (2)
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు (2)   "అదే"

2) సూర్యుడు నలుపయ్యే రోజు - చంద్రుడు ఎరుపెక్కే రోజు
భూకంపం కలిగే రోజు - దిక్కు లేక అరిచే రోజు (2)
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు (2)  "అదే"

3) మిడతల దండొచ్చే రోజు - నీరు రక్తమయ్యే రోజు 
కోపాగ్ని రగిలే రోజు - పర్వతములు పగిలే రోజు (2)
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు (2)  "అదే"

4) వ్యభిచారులు ఏడ్చే రోజు - మోసగాళ్ళు మసలే రోజు
అబద్ధికులు అరిచే రోజు - దొంగలంతా దొర్లే రోజు (2) 
ఆరోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు(2)   "అదే" 

5) పిల్ల జాడ తల్లికి లేక - పిల్ల జాడ తల్లికి రాక 
చెట్టుకొకరు పుట్టకొక్కరై - అనాథలై అరిచే రోజు (2)
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు (2) "అదే" 

6) ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో 
బలము చూసి భంగ పడకుమా 
ధనము చూసి ధగా పడకుమా (2)                " ఆ రోజు " 

Comments

Popular Posts