ఆధారం నాకు ఆధారం - adharam naku adharam song lyrics
ఆధారం నాకు ఆధారం
నాకు తోడైయున్న నీ కృపయే ఆధారం
ఆశ్రయము నాకు ఆశ్రయము
ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము
తల్లితండ్రి లేకున్నా - బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైన - బాధలన్ని బంధువులైనా" ఆధారం "
భక్తిహీన బంధం లో నేనుండగా
శ్రమల సంద్రములో పడియుండగా (2)
ఇరుకులో విశాలతను కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) " ఆధారం "
దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి
నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) " ఆధారం "
Comments