అబ్రాహాము దేవుడవు - abarahamu devudavu song lyrics

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు 
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 

1)అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను 
పునాదుల  గల పట్టణముకై  వేచి జీవించెను 
అబ్రాహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా 
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య  

2)ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను 
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను  
ఇస్సాకు చాలిన దేవుడ నీవెనయ్యా  
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 

3) యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను 
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను  
యాకోబు చాలిన దేవుడ నీవెనయ్యా 
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 

Comments

Popular Posts