యే పాప మెరుగని - ye papa merugani song lyrics
యే పాప మెరుగని యో పావణామూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా
1) ముళ్ళతో గిరీట మళ్ళీ నీ శిరముపై జల్లాతమున మొత్తిరా ముళ్ల పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లి పోతివ రక్షకాయ " యే పాప "
2) కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని దోడుగా నిచ్చినారా " యే పాప "
3) చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా " యే పాప "
4) ఆ కాల కర్ములు భీకారంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో
గ్రుచ్చినారా " యే పాప "
5) పలువిధంబుల శ్రమలు చెలరేగన్ దండ్రికి నెలుగెత్తి మొరలిడితి వా సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా " యే పాప "
6) బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కన్ జిల్లి బడ బొడిచి నాడా ఉల్లోలముల వలె నల్ల నీ రుబుకంగా జల్లారే గదా కోపము " యే పాప "
7) కటా కటా పాప సంకటము బాపుట కింత పటు బాధ నొందినావా ఎటువంటి దీ ప్రేమ ఎటువంటి దీ శాంత మెటుల వర్ణింతు స్వామి " యే పాప "
Comments