సిలువపై వ్రేలాడే - siluvapai vrelade song lyrics
సిలువపై వ్రేలాడే శ్రీ యేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర ధారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు
1) నిరపరాధి మౌన భుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మనచివేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను " సిలువపై "
2) కలువరి గిరి కన్నీళ్లతో కరిగి పోయెను
పాప జగతి పునాదులే కదలి పోయెను
లోకమంతా చీకటి ఆవరించెను
శ్రీ యేసుడు తలవాల్చి కన్నుమూసెను " సిలువపై "
Comments