సిలువలో నా కొరకు - siluvalo naa koraku song lyrics

సిలువలో నా కొరకు వ్రేలాడిన యేసయ్యా
పరిశుద్ధ రక్తమును చిందించి నావయ్యా    (2)
ఏల ఈ ఘోర శ్రమ  ఘన దైవమా నీకు  
పాపిని రక్షించుటకు బలియైతివా (నీవు) (2) 

నా పాప యోచనలు ముండ్ల మకుట మాయెను 
నే చేసిన దోషములు చేతులలో సీలలాయె (2)
నా చెడు నడతలు ప్రక్కలో బల్లెమాయె (2)
నేనే ప్రభు  నిన్ను సిలువకప్పగించినది (2)  " సిలువలో "

నా పాప భారమంతా సిలువలో మోసితివి 
వ్యాధి బాధ లన్నీ నీవే భరియించితివి  (2) 
సురూపివి నీవయ్యా కురూపిగా మారితివి (2)
ఏమని వర్ణింతు నీ త్యాగ నిరతిని (2)
నేనెమని వర్ణింతు నీ త్యాగ నిరతిని (2)    " సిలువలో "

నీ సిలువను చూడగనే మనసు నీరై కరిగెను 
నా హృదయం ఎంతో వేదనతో నిండెను (2)
ఈ లోకమును వీడి నిను వెంబడింతునయ్య (2)
క్షమియించి నీ సాక్షిగా స్థిర పరచుము యేసయ్య (2)
                                                           " సిలువలో " 



Comments

Anonymous said…
There is also another song with similar title sung by Allen Ganta, could you pls supply the lyrics

Popular Posts