సిలువలో ఆ సిలువలో - siluvalo aa siluvalo song lyrics
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరి లో
తులువలో మధ్యలో వ్రేలాడిన యేసయ్య
వెలియైన యేసయ్య బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) "సిలువలో"
1) నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొఱకు
భారమైన సిలువ మోయలేక మోశావు (2)
కొరడాల చెళ్ళని చీల్చెనే నీ సుందర దేహమునే (2)
తడిపెనే నీ తనువునే రుధిరంపు ధారలే
" వెలియైన "
2) వధకు సిద్ధమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మి వేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించి రా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగ మేసయ్యా
" వెలియైన "
3) నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్
నాదు శాపమే నిన్ను అణువణువునా హింసించెన్ (2)
నీవు కార్చిన రక్త ధారలే నా మోక్ష నాధారం (2)
సిలువకు చేరేదన్ విరిగిన హృదయము తో ను
" వెలియైన "
Comments