సిలువ సాక్షిగా యేసు సిలువను - siluva sakshiga yesu song lyrics

సిలువ సాక్షిగా యేసు సిలువను 
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన .. ఇదే నా ప్రార్ధన          " సిలువ " 

యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే 
క్రీస్తు తలను గ్రుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే 
సిలువలో వ్రేలాడ దీసేను అధికారమే 
కులమా కళ్ళు పొడుచుకో - మతమా ఉరి పోసుకో 
                                                     " సిలువ " 

లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే  
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2) 
దైవ మానవ పాలన క్రీస్తు సిలువ జీవమే 
సమ సమాజ స్థాపనలో  యేసు సిలువ సత్యమే 
కులమా కళ్ళు పొడుచుకో - మతమా ఉరి పోసుకో 
                                                    " సిలువ " 

Comments

Popular Posts