సాక్ష్యమిచ్చెద మనస్వామి - sakshya michedha mana svami song lyrics
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసున్ దేవుడంచు - సాక్ష్య మనగన్ గనిన వినిన సంగతులను దెల్పుటయే - సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు " సాక్ష్య "
1) దిక్కు దెసయు లేని నన్ను - దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చి నాడో
" సాక్ష్య "
2) పల్లెటూళ్ల జనుల రక్షణ - భారము నాపైని గలదు పిల్లలకును పెద్దలకును - బ్రేమతో నా స్వానుభవము
" సాక్ష్య "
3) బోధ చేయలేను వాద - ములకున్ బోను నాకదేల నాథున్ డేసు ప్రభుని గూర్చి నాకున్ దెలిసినంత వరకు
" సాక్ష్య "
4) పాపులకును మిత్రుడంచున్ - బ్రాన మొసంగి లేచె నంచున్ - భావముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు " సాక్ష్య "
5) చోరులైన జారులనా చారు లైనా నెవ్వరైన = ఘోర పాపులైనన్ క్రీస్తు కూర్మి తో రక్షించు నంచు " సాక్ష్య "
6) పరమత దూషణము లేల - పరిహసించి పలుకటే ల
= ఇరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడంచు
" సాక్ష్య "
7) ఎల్లకాల మూర కుండ - నేల యాత్మ శాంతి లేక - తల్ల డిల్లు వారలకును - తండ్రి కుమారాత్మ పేర " సాక్ష్య "
Comments