ప్రార్ధన వినెడి పావనుడా - prardhana vinedi pavanuda song lyrics

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా (1)

1) శ్రేష్ఠమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి
= పరముడ నిన్ను ప్రనుతించెదము పరలోక ప్రార్ధన నేర్పుమయా                                     " ప్రార్ధన "

2) పరమ దేవుడ వని తెలిసి కరము లెత్తి జంటగా మోర్చి = సిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్ధన నేర్పుమయా                                     " ప్రార్ధన "

3) దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు - దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా                                    " ప్రార్ధన "

4) శత్రుమూక నిను చుట్టుకుని - సిలువ పైని నిను జంపగను = శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా                          " ప్రార్ధన "    

Comments

Popular Posts