పరమజీవము నాకునివ్వ - parama jeevamu naaku nivva song lyrics

పరమ జీవము నాకు నివ్వ 
తిరిగి లేచెను నాతో నుండ 
నిరంతరం నన్ను నడిపించును 
మరల వచ్చి యేసు కొనిపోవును 
యేసు చాలును - హల్లెలూయ .. (2)
ఏ సమయమైన ఏ స్థితికైనా
నా జీవితములో యేసు చాలును 

1) సాతాను శోధనలధికమైన 
    సొమ్మ సిల్లక సాగి వెళ్లెదను 
    లోకము శరీరము లాగినను 
    లోబడక నేను వెళ్లెదను (2)               " యేసు " 

2) పచ్చిక బయలులో పరుండజేయున్  
     శాంతి జలము చెంత  నడిపించును 
     అనిశము ప్రాణము తృప్తి పరచున్  
     మరణ లోయలో నన్ను కాపాడును   " యేసు " 

3) నరులెల్లరు నను విడచినను 
    శరీరము కుళ్ళి కృశించినను 
    హరించినన్ నా ఐశ్వర్యము 
    విరోధి వలె నన్ను విడిచినను            " యేసు " 

Comments

Popular Posts