ఓ నేస్తమా ఈ శుభవార్త - o nesthama ee subhavartha song lyrics

ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా  (2)
నిను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా (2)

నీవు నమ్మినవారు మోసంతో నీ గుండెనే చీల్చినా   
నీ సొంత జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా (2)
ఊహించనివి జరిగినా  అవమానం మిగిలినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని  వాస్తవం తెలియునా  
నీ స్థితి మార్చువాడు యేసయ్యే నని సత్యం తెలియునా  

నీ కష్టార్జితము  అన్యాయము చేయువారికే చిక్కిన  
నీకున్న స్వాస్థ్యము దోపిడి దారుల చేతికే చిక్కిన (2)
ఉద్యోగమే ఊడినా వ్యాపారమే ఓడినా (2)
నిను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా 
నీ స్థితి మార్చువాడు యేసయ్యే నని సత్యం తెలియునా 
 

Comments

Popular Posts