నిను నమ్మినచో - ninu namminacho song lyrics
నిను నమ్మినచో సిగ్గు పడనీయవు
నను నెమ్మదితో నీవె ఉంచెదవు
ఆపత్కాలమున నమ్ముకొన దగిన
యేసు నీవె ఆధారము
యేసు నీవె నా ప్రాణము (2)
1) తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను (2)
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను (2)
" యేసు "
2) బలమును నమ్ముకొని భంగ పడ్డాను (2)
శక్తి మంతుడా నా కోటవని నీ చెంత కు చేరాను (2)
" యేసు "
3) ధనమును నమ్ముకొని దగా పడ్డాను (2)
సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను (2)
" యేసు "
4) మనుష్యుల నమ్ముకొని మభ్య పడ్డాను (2)
సత్య వంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను (2)
" యేసు "
Comments