నేనున్న స్థితిలోనే - nenunna sthithi lone song lyrics
నేనున్న స్థితిలోనే సంతృప్తి ని కలిగించు
ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు (2)
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలో నైనా స్తుతి చేయుట నేర్పించు (2)
1) లోకములో నీ కొరకు జ్యోతిగా నను వెలిగించు (2)
రెండవ రాకడ వరకు విడువక నను నడిపించు (2)
" కష్టాలు "
2) నా దినముల పరిమాణము లెక్కించుట నేర్పించు(2)
నా లోపల స్థిర హృదయము నూతనముగా పుట్టించు (2)
" కష్టాలు "
3) సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు (2)
సమాయోచిత జ్ఞానమును దయచేసి దీవించు (2)
" కష్టాలు "
Comments