నీ రక్తమే నీ రక్తమే - nee rakthame nee rakthame song lyrics
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము
1) రక్త ధారలే ఇలా పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము " నీ "
2) నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
రక్షింప బడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది
" నీ "
3) నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
పాప విముక్తి చేసితివి - పరిశుద్ధ దేవ తనయుడా
" నీ "
4) పంది వలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను
ప్రేమతో చేర్చు కొంటివి - ప్రేమార్హ నీకే స్తోత్రము
" నీ "
5) నను వెంబడించు సైతానున్ నన్ను బెదిరించు సైతానున్
ధనుమానెడిది నీ రక్తమే - దహించునది నీ రక్తమే" నీ "
6) స్తుతి మహిమ ఘనతయు - యుగయుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హ నీకే తగును " నీ "
Comments