నీ మాట నా పాటగా - nee maata naa pataga song lyrics

నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ 
లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ 
నా గీతం .. ఆత్మలను .. నీ వైపే ఆకర్షించనీ 
ఆదరణ .. కలిగించి .. నీలోనే ప్రహర్షించనీ    " నీ మాట " 

ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ  
పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ (2)
వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపకా 
స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించనీ       " నా గీతం " 

నీ దివ్య గానామృతం - జల ధారలుగా పొంగనీ  
తాకేటి ప్రతి వారిని - బలవంతముగా మార్చనీ (2)
శృతి లయలు లోపించకా - విసిగింపు కలిగించకా 
నిజమైన ఉల్లాసమై - నిలువెల్ల కదిలించనీ   " నా గీతం "

ఆత్మీయ గీతాలతో - తనువంత పులకించనీ   
సంగీతమే బోదయై - కనువిప్పు కలిగించనీ  (2)
కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా 
హృదయాల్లో నివసించుచు - కార్యాలు జరిగించనీ 
                                                            " నీ గీతం " 
 

Comments

Popular Posts