నాకింత ప్రోత్సాహ - nakintha prothsaha song lyrics

నాకింత ప్రోత్సాహా నందముల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువై యుండు - నాకు గల యున్నత కతమ్మే నాధున్ డగును నేను మరియు శ్రీకరంబగు నామ మేది - సిల్వ బడ్డ యేసు క్రీస్తే           

1) ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాధి  - ఎవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో - ఎవరు నా పాపముల  భారము నెత్తుకొని దేవునికిని నాకును  చివరకును స్నేహంబు కల్పిరి - సిల్వ బడ్డ యేసు క్రీస్తే      " నా కింత "

2) నేను నా విధులెల్ల నిశ్చయంబుగా నెఱుఁగ జ్ఞాన మిచ్చు చు నుండు జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యథార్థ పరునిగాన్ గావించి యవినా - చే నెర వేర్పించు నెవరు 
సిల్వ బడ్డ యేసు క్రీస్తే                               " నా కింత "

3) ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి - ఎవరు నా శోకంబు నెగురన్ గొట్టిరి = ఎవరు నా హృదయంబు మూర్చను  నీడ్చి సేదను దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వ బడ్డ యేసు క్రీస్తే " నా కింత " 

4) మరణంబులో నాకున్ - జిర జీవ మెవ్వారు  మరణంబునకే గొప్ప మరణ మెవ్వారు - విరివి లేని మహిమ సేలు - దరిని నుండఁగ నన్నున్ జెంతను స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వ బడ్డ యేసు క్రీస్తె  " నా కింత " 

5) నన్ను రక్షింప మర - ణం బొందియు సమాధి నెన్నటికిని గెల్చి యున్న ప్రభువునందు నున్న విశ్వాసంబె నాకు - నుత్సవంబును గలుగజేయును చెన్నగు నా ప్రభు విన్ కెవ్వరు సిల్వన్ బడ్డ యేసు క్రీస్తే               "నాకింత "

Comments

Popular Posts