నా హృదయ కౌగిలిలో - naa hrudhaya kaugililo song lyrics
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగి పోనీ (2)
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
" నా హృదయ "
నా లోపల సంచరించి - నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి - సరిగా నడిపించి (2)
నా జీవితం వెలిగించినావా (2)
నీ రూపమే నాలో ముద్రించినావ " నా హృదయ "
బలహీనతలను హరియించి శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి - సత్యము బోధించి (2)
నా భారమే భరియించినావ (2)
నీ శాంతినే నాలో స్థాపించి నావా (2) " నా హృదయ "
అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి (2)
నా శోకమే తొలగించి నావ (2)
స్తుతి గానమే నాలో పలికించి నావా " నా హృదయ "
Comments