నా హృదయ కౌగిలిలో - naa hrudhaya kaugililo song lyrics

నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి 
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగి పోనీ (2)
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ 
                                                      " నా హృదయ "

నా లోపల సంచరించి - నాతో భుజియించి 
జీవపు మార్గము చూపించి - సరిగా నడిపించి (2)
నా జీవితం వెలిగించినావా (2)
నీ రూపమే నాలో ముద్రించినావ          " నా హృదయ " 

బలహీనతలను హరియించి శక్తితో దీవించి 
అజ్ఞానము నిర్మూలించి - సత్యము బోధించి (2)
నా భారమే భరియించినావ (2) 
నీ శాంతినే నాలో స్థాపించి నావా (2)   " నా హృదయ "

అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి 
ఆనందము ననుగ్రహించి  - ఆత్మీయత పెంచి (2)
నా శోకమే తొలగించి నావ (2) 
స్తుతి గానమే నాలో పలికించి నావా   " నా హృదయ " 



Comments

Popular Posts