మనిషిగా పుట్టినోడు - manishiga puttinodu song lyrics
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూసిక పుల్లైనా
ఇల సంపాదన వదల వలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండ గానే నీవు ప్రభుని నమ్ముకో (2)
1) ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆగిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్లు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులవుతారు (2) " మనిషి "
2) జన్మ నిచ్చిన వాడు క్రీస్తు యేసు దేవుడే
జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) " మనిషి "
3) నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమ పడకు
చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్లు తెరుచుకో
" మనిషి "
Comments