లేచినాడు రా సమాధి - lechinadu raa samadhi song lyrics

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు 
లేచినాడు రా సమాధి గెలిచినాడురా 
లేతునని తా జెప్పినట్టు 
లేఖనము లో పలికినట్టు               " లేచి "


1) భద్రముగా సమాధి పైని 
    పెద్ద రాతిని యుంచిరి భటులు - 
    ముద్ర వేసి రాత్రి యంత 
    నిద్ర లేక కావలి యున్న  (2)      " లేచి " 

2) ప్రభువు దూత పరము నుండి 
    త్వరగా దిగి రాతిని పొర్లించి 
    భళిరా దాని పై కూర్చుండె 
    భయము నొంద కావలి వారు      " లేచి " 

3) పొద్దు పొడవక ముందే స్త్రీలు 
    సిద్ధ పరచిరి సుగంధములు 
    శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు 
    రుద్దుదామని వచ్చి చూడ          " లేచి " 

4) చూడ వెళ్లిన స్త్రీలను దూత 
    చూచి యపుడే  వారి తోడ 
    లేడు గలిలయ ముందుగా పోతున్నాడు 
    అప్పుడే లేచి నాడని                  " లేచి " 

5) చచ్చి పోయి లేచినాడు 
     స్వామి భక్తుల కగు పడినాడు 
     చచ్చినను నను లేపుతాడు 
     చావు అంటే భయ పడ రాదు     " లేచి "

6) నేను చేసే పనుల నెరుగు 
     నేను నడిచే మార్గ మెరుగు 
     నేను చెప్పే మాటలెరుగు 
     నేను బ్రతికే బ్రతుకు నెరుగు        " లేచి " 

7) నేను లేచిన యేసు నందు 
     మానక మది నమ్ముకొందు 
     తాను నాలో నుండినందున 
     దయను చేర్చు మోక్ష మందు     " లేచి " 

8) పాప భారము లేదు మనకు 
     మరణ భయము లేదు మనకు 
     నరక బాధ లేదు మనకు 
     మరువ కండి యేసు ప్రభుని      " లేచి " 

9) యేసు నందే రక్షణ భాగ్యం 
     యేసు నందే నిత్య జీవం 
     యేసు నందే ఆత్మ శాంతి 
     యేసు నందే మోక్ష భాగ్యo       " లేచి " 

10) పాపులకై వచ్చినాడు 
      పాపులను కరుణించి నాడు 
      పాపులను ప్రేమించినాడు 
       ప్రాణ దానము చేసినాడు      " లేచి " 
  
   

Comments

Popular Posts