కృపామయుడా నీలోన - krupamayuda nelona song lyrics

కృపామయుడా నీలోనా (2) 
నివసింప చేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో (2) 

ఏ అపాయము నా గుడారము 
సమీపించ నీయక (2)
నా మార్గములన్నిటిలో 
నీవే ఆశ్రయమైనందున (2)                     " కృపా "

చీకటి నుండి వెలుగులోనికి 
నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజ వంశములో 
యాజకత్వము చేసెదను (2)                 " కృపా " 

నీలో నిలిచి ఆత్మ ఫలము 
ఫలియించుట కొరకు (2)
నాపైన  నిండుగా 
ఆత్మ వర్షము కుమ్మరించు (2)               " కృపా " 

ఏ యోగ్యత లేని నాకు 
జీవ కిరీట మిచ్చుటకు  (2) 
నీ కృప నను వీడక 
శాశ్వత కృప గా మారెను (2)               " కృపా " 



                 

Comments

shalem Raj said…
Excellent song💐💐💐💐💐

Popular Posts