కొంతసేపు కనబడి - kontha sepu kanabadi song lyrics

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే 
ఆవిరి వంటిదిరా ఈ లోకము 
లోకాన కదేది శాశ్వతం (2)
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)  " కొంత " 

ఎదురౌతారెందరో నీ పయనం లో 
నిలిచేది ఎందరో నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదెవరు ఆ పై నిత్య జీవము నీకు           " యేసే " 

చెమటోడ్చి సుఖము విడచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
నీ సంపాదన ఎవరిదగునో యోచించితివా   " యేసే " 

నీ శాపం తాను మోసి పాపం తీసి 
రక్షణ భాగ్యం నీకు సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగా నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యం చేసి తప్పించుకొందువా                " యేసే " 

Comments

Popular Posts