కల్వరి స్వరము నీ కొరకే - kalvari svaramu nee korake song lyrics

కల్వరి స్వరము నీ కొరకే 
సుమధుర స్వరము మన  కొరకే 
మరి ఆలకించుమా ప్రభు స్వరము ... ప్రియ స్వరము .. 

1) సత్యము తెలియని గమ్యము దొరకని 
    వారికేగా కల్వరి స్వరము 
    శాంతి లేకటు బ్రతుక లేకటు
    అల్లాడుచున్న వారికి స్వరము 
    ఆశల అలలో నిరాశలో వలలో 
    చిక్కిన వారికి కల్వరి స్వరము 
    చిక్కిన వారికి ప్రభుని స్వరము ...    " కల్వరి " 

2) గాలి తుఫానులో చెదరిన వారిని 
    దరికి చేర్చును కల్వరి స్వరము 
    చితికిన బ్రతుకును పగిలిన గుండెను 
    ఆదరించును ప్రియుని  స్వరము 
    దాహము గొనిన వారల కెల్ల 
    సేద దీర్చును కల్వరి స్వరము  
    సేద దీర్చును ప్రభు ని స్వరము     " కల్వరి " 

3) మార్పును కోరక తీర్పును తలచక 
     తిరుగు వారికి కల్వరి స్వరము 
     పైకి భక్తితో లోపల రక్తి తో 
     బ్రతుకు వారికి కల్వరి స్వరము 
     వేడిగ లేక చల్లగ లేక 
     నులువెచ్చగుండే వారికి స్వరము  (2)  " కల్వరి " 
    

Comments

Popular Posts