ఇన్నాళ్లు తోడుగా - innaallu thoduga song lyrics
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతును జీవితాంతము (2)
1) ఘనులైన వారే గతియించగా
ధనమున్న వారే మరణించగా (2)
ఎన్న తగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)
" ఇశ్రాయేలు "
2) మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కాంతిరెప్ప లా కాచి భద్ర పరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగ పరచి యున్నావు (2)
" ఇశ్రాయేలు "
3) ఈలోక యాత్రలో సాక్షులుగా
నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా (2)
ఎట్టి యోగ్యతా లేని మమ్ము ఎన్నుకున్నావు
నీదు ఆత్మ శక్తి తో నింపి నడుపుచున్నావు (2)
" ఇశ్రాయేలు "
Comments