ఏరిగియున్నానయా - erigiyunnaanaya song lyrics

ఎరిగియున్నానయా - నీకేది అసాధ్యము కాదని 
తెలుసుకున్నానయా - నీవెపుడు మేలు చేస్తావని 
మార్పు లేని దేవుడ నీవని 
మాట ఇచ్చి నెరవేర్చుతావని (2)
మారని వాగ్ధానాములు 
మా కొరకు దాచి యుంచావని        " ఎరిగి " 

నను చుట్టి ముట్టిన బాధలతో - నాహృదయం కలవరపడగా 
నా సొంత జనుల నిందలతో - నా గుండె నాలో
నీరై పోగా (2) 
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయ పడకంటివే 
మిక్కుట ప్రేమను చూపితివే - నను ఓదార్చితివే 
                                                 " ఎరిగి "

మించిన బలవంతుల చేతి నుండి - తప్పించిన యేసు దేవుడా 
వంచన కారుల వలల నుండి - రక్షించిన  హృదయ నాథుడా  (2)
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే .
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే 
                                                " ఎరిగి " 


Comments

Popular Posts