చూడుము ఈ క్షణమే - chudumu ee kshaname song lyrics

చూడుము ఈ క్షణమే కల్వరిని 
ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను 
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు 
సిలువలో వ్రేలాడు చున్నాడు గా 

1) మానవులెంతో చెడి పోయిరి  
     మరణించెదరని తలపోయక 
     ఎరుగరు మరణము నిక్కమని 
     నరకమున్నదని వారెరుగరు            " చూడుము "

2) ఇహమందు నీకు కలవన్నియు 
    చని పోవు సమయాన వెంట రావు 
    చని పోయినను నీవు లేచెదవు 
    తీర్పున్నదని ఎరుగు ఒక దినమున  " చూడుము " 

3) మనలను ధనవంతులుగా చేయను 
    దరిద్రుడాయెను మన ప్రభువు  
    రక్తము కార్చెను  పాపులకై 
    అంగీక రించుము శ్రీ యేసుని         " చూడుము "

4) సిలువపై చూడుము ఆ ప్రియుని 
    ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు 
    అర్పించుకో నీదు జీవితము 
    ఆయన కొరకై జీవింతుము          " చూడుము " 
    

Comments

Popular Posts