చూడుము ఈ క్షణమే - chudumu ee kshaname song lyrics
చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడు గా
1) మానవులెంతో చెడి పోయిరి
మరణించెదరని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు " చూడుము "
2) ఇహమందు నీకు కలవన్నియు
చని పోవు సమయాన వెంట రావు
చని పోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున " చూడుము "
3) మనలను ధనవంతులుగా చేయను
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీక రించుము శ్రీ యేసుని " చూడుము "
4) సిలువపై చూడుము ఆ ప్రియుని
ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవింతుము " చూడుము "
Comments