గీతం గీతం జయజయగీతం - geetham geetham jaya jaya geetham song lyrics

గీతం గీతం జయ జయ గీతం 
చేయితట్టి పాడెదము 
యేసు రాజు లేచెను హల్లెలూయ 
జయమార్భటించెదము (2)

1) చూడు సమాధిని మూసిన రాయి 
     దొరలింప బడెను  
     అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా 
     దైవ సుతుని ముందు  (2)                " గీతం " 

2) వలదు వలదు ఏడువ వలదు 
     వెల్లుడి గలిలయకు  
     తాను చెప్పిన విధమున తిరిగి లేచెను 
     పరుగిడి ప్రకటించుడి  (2)                " గీతం " 

3) అన్న కయప వారల సభయు 
     అధరుచు పరుగిడిరి 
     ఇంక దూత గణముల ధ్వనిని వినుచు 
     వణుకుచు భయపడిరి  (2)             " గీతం "

4) గుమ్మలు తెరిచి చక్కగా నడువుడు
    జయ వీరుడు రాగ  
    మీ మేళ తాళ వాద్యముల్ బూర
    లెత్తి ధ్వనించుడి     (2)                  " గీతం " 


Comments

Popular Posts