భాసిల్లెను సిలువలో పాపక్షమా - bhasillenu siluvalo papa kshama song lyrics

భాసిల్లెను సిలువలో పాప క్షమా 
యేసు ప్రభూ నీ దివ్య క్షమా         " భాసిల్లెను " 

1) కలువరిలో నా పాపము పొంచి  
    సిలువకు యాహుతి చేసి 
    కలుష హరా కరుణించితివి    " భాసిల్లెను " 

2) పాపము చేసి గడించితి మరణం 
    శాపమెగా నే నార్జించినది 
    కాపరివై నను బ్రోచితివి         " భాసిల్లెను "

3) ఎందులకో నా పై ఈ ప్రేమ 
    అందదయా స్వామి నా మదికి 
    అందులకే భయ మొందితిని " భాసిల్లెను " 

4) నమ్మిన వారిని కాదనవనియు 
    నెమ్మది నొసగెడి నా ప్రభుడవని 
    నమ్మితి నీ పాదంబులను    " భాసిల్లెను "

Comments

Popular Posts